ఏపీ లోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జనవరి 19న (సోమవారం) తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. కాలేజీల సెలవుల గురించి ప్రకటన రావాల్సి ఉంది. అటు తెలంగాణలోనూ స్కూళ్లకు ఇవే తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.