గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతూ... పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం పలాస కు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. పలాస ఇందిరా చౌక్ నుంచి కేటి రోడ్డు మీదుగా... వేలాదిమంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాశీబుగ్గ డిఎస్పి షేక్ సహబజ్ అహ్మద్, సిఐ రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.