Skip to main content

సిక్కోలు జిల్లాలో బయటపడ్డ నిత్య పెళ్లికూతురి యవ్వారం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వెలిసిన నిత్య పెళ్లికూతురు

కేవలం 19 ఏళ్లకే - 8 పెళ్లిళ్లు.       

పెళ్లికాని ప్రసాదులను - ముంచేస్తున్న ముత్తి రెడ్డి           

ఈ లేడీ మాముల్ది కాదు బాబోయ్ పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కానీ ఆమెకు మాత్రం పెళ్లి అంటే ఓ మూడు రోజుల ముచ్చట. అందుకే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు ఏకంగా ఎనిమిది మంది భర్తలను మార్చింది శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ మహిళ. చివరకు బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించటంతో ఆ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం బయట పడింది.

ఇచ్చాపురం పట్టణంలోని కర్జీ వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి(19) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా ఇపుడు ఆమె వార్తల్లోకి ఎక్కింది. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట మగవారిని నమ్మించి మోసగించడం ప్రవృత్తిగా పెట్టుకుంది వాణి. పెళ్లి కానీ ప్రసాదులను ఎంచుకొని వారి నుంచి ఎదురు కట్నం తీసుకొని పెళ్లికి సిద్ధం అవుతుంది. తీరా పెళ్లయ్యాక వారం రోజుల్లోనే చెప్పచెయ్యకుండా పరారవుతుంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకకు చెందిన వ్యక్తినీ పెళ్లి చేసుకుని అతనికి హ్యాండ్ ఇచ్చింది

వివాహం అనంతరం వరుడు సొంత ఊరు కర్ణాటక వెళుతున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో వరుడుతో కలిసి ట్రైన్ ఎక్కిన ఆమె విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద బాత్ రూమ్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్ళి ట్రైన్ దిగి ఎస్కేప్ అయింది. తర్వాత ఆమె ఏమైందా అని ఆందోళనకు గురైన వరుడు ,అతని కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా ఇచ్చాపురం లోని మేనత్త ఇంటికి చేరుకున్నట్టు తెలిసింది. అయితే అప్పటికే వాణికి వరుడు తురుపు వారు లక్ష రూపాయలు ఎదురు కట్నంతో పాటు బట్టలు, ఇతర ఖర్చుల నిమిత్తం డబ్బులు వాణికి ఇచ్చారు. ఇంకేముంది వీటిన్నింటి పట్టుకొని పరారైంది వాణి.. ఇక వాడి జాడకోసం వెతుకుతున్న వరుడి కుటుంబ సభ్యులు ఆమె మేనత్తను సంప్రదించగా వాణి అసలు వ్యవహారం అంతా బయట పడింది.

విషయం తెలిసి కంగుతిన్న వరుడి కుటుంబ సభ్యులు.. వాణి మేనత్త సంధ్యను నిలదీయగా వారి డబ్బులు వారికి ఇచ్చేస్తామని చేప్పార్. కట్‌చేస్తే చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. దీంతో గురువారం వాణి వల్ల మోసపోయిన బాధితులు నాగి రెడ్డి, కేశవ రెడ్డి ఇచ్చాపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇప్పటి వరకు 8 మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్టు ఫోటోలను ,వీడియోలను సంపాదించి ఆధారాలుగా పోలీసులకు వాటిని అందజేశారు.

అయితే బాధితుల ఫిర్యాదుపై ఇచ్చాపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాణి తల్లి చిన్నప్పుడే మృతి చెందటం తండ్రి పెద్దగా ఆమెను పట్టించుకోకపోవడంతో మేనత్త సంధ్య ఆమెను చేరదీసింది. సంధ్య గతంలో మైనర్ కావడంతో పెళ్లి పేరిట ఆమె ఇంతమందిని మోసగించిన వారెవరు గతంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు. అయితే ఇప్పుడు ఆమె వయసు 19 ఏళ్ళు కావడంతో ఆమె పెళ్ళిళ్ళ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి.

High Viewed News

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.