శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి 01:00 గంటలు వరకు మాత్రమే అనుమతి ఉందని కాశీబుగ్గ సిఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు. ఎవరైనా కల్చరల్ ప్రోగ్రామ్స్, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో మద్యం మత్తులో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.