శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లచ్చన్న పేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి వరద కాలువ లోకి దూసుకుపోయింది. లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ... క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.