శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర భాగంగా... జంట పట్టణాలలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశిబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ రంగంలో అవకాశాలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, సీఐ రామకృష్ణ, సచివాలయ, మెప్మా సిబ్బందితోపాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.