Skip to main content

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

*ఏపీ: అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడ్డ బస్సు 15 మంది యాత్రికులు మృతి.

TG: ప్రశాంతంగా ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికలు

* పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా

* రాష్ట్ర బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ అసహనం

* AP: రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం

* కడప మేయర్ స్థానం వైసీపీ కైవసం

* ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల ట్రావెల్ వోచర్లు

* ఆరు రాష్ట్రాల్లో SIR గడువును పెంచిన ఈసీ

* పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం

* సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్

* AP ప్రిజన్స్ &కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే

* రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం

* SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

* కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం

* రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు AP క్యాబినెట్ ఆమోదం

* అమరావతిని శాశ్వత రాజధాని చేసేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడతాం: కేంద్రమంత్రి పెమ్మసాని

* తెలంగాణలో ముగిసిన పంచాయతీ తొలి విడత ఎన్నికలు

* TGలో ఇంటర్ వరకు ఒకే బోర్డు ఉండేలా విద్యా శాఖ చర్యలు

* పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై దక్షిణాది BJP MPలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

* అఫ్గానిస్థాన్పై పాక్ వైమానిక దాడులను UN భద్రతా మండలిలో ఖండించిన భారత్

* HYD వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రదర్శనకు 700+ షార్ట్ ఫిల్మ్స్ రాగా 60 ఎంపికయ్యాయి.

* పలువురు కాంగ్రెస్ MLAలు, నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్(BRS) హైకోర్టులో పిల్ వేశారు.

* వర్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు MP అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.

* తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు

* హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు.. కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్

* రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM CBN

* ట్రంప్కు PM మోదీ ఫోన్.. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు

* పనితీరు మారాలంటూ TBJP ఎంపీలకు PM మోదీ హితబోధ

* సౌతాఫ్రికాతో రెండో టీ20లో భారత్ ఓటమి.

High Viewed News

పూండిలో కలకలం రేపిన బంగారం చోరీ...

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.

పలాసలో రైలు నుంచి జారిపడిన మహిళకు తీవ్ర గాయాలు

కలకత్తా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో ప్రయాణం చేస్తూ... ఆదివారం పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళ జారిపడింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సత్యం & వెంకట్రావు ఘటన స్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించి, వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ అస్సాం కు చెందిన అజ్వినా ఖాన్ గా గుర్తించి కేసు నమోదు చేసిన పలాస జిఆర్పి పోలీసులు.

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

SIR విధులకు అదనపు వేతనం ఇవ్వాలని వినతి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు అదనపు గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావుకు ఆదివారం కంప్యూటర్ ఆపరేటర్లు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. SIR విధుల్లో భాగంగా అదనపు పనిభారం, సాంకేతిక మరియు ఇతర కార్యనిర్వహణ సమస్యలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. అదనంగా నిర్వహిస్తున్న విధులను పరిగణనలోకి తీసుకుని అదనపు గౌరవ వేతనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు సానుకూలంగా స్పందిస్తూ... తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సిమ్మన్న, హరి, కోదండ, సుధాకర్ తదితర ఎన్నికల కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.