Skip to main content

పలాసలో నందమూరి అభిమానుల సందడి.

శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో ఎంతో ఉత్కంఠ ంగా చూస్తున్న నందమూరి అభిమానులకు నిరాశ మరోసారి ఎదురైనట్లు కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా ఇప్పటికే రెండుసార్లు పలు కారణాల చేత వాయిదా పడిన విషయం తెలిసిందే... నేడు ప్రీమియర్ షో వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో... పలాస శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ వద్దకు నందమూరి అభిమానులు భారీగా చేరుకున్నారు. రాత్రి 10 అవుతున్న సినిమా హాల్ గేట్లు తెరవకపోవడంతో అ ప్రాంతం ఉద్రిక్తతగా మారింది.

High Viewed News

సోంపేట పట్టణంలో 30 తులాల బంగారం చోరీ.

శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

పలాసలో లారీ కిందకు దూసుకుపోయిన ద్విచక్ర వాహనం.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ ముందు టైరు లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా అంతరసింగి గ్రామానికి చెందిన కే ఈశ్వరరావు (19) కు తీవ్ర గాయాలు కాగా, సునీల్ కుమార్ (19) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాశీబుగ్గ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన వై రామకృష్ణ

కాశీబుగ్గ టౌన్ సీఐ గా వై రామకృష్ణ ఆదివారం విధుల్లో చేరారు. కాగా ఈయన ఇదే పోలీస్ స్టేషన్ లో 09-11-2013 నుంచి 19-06-2016 వరకు సీఐ గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే... విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాల నుంచి కాశీబుగ్గ స్టేషన్ లో సీఐ గా విధుల్లో చేరారు. ఇదే స్టేషన్లో సిఐ గా విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణ విఆర్ కు రిపోర్ట్ చేసినట్లు సమాచారం.

పలాస ఆర్ఆర్ కాలనీలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహేంద్ర తనయ ఆప్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో సుమారు రూ. 7.61 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలలో మౌలిక వసతులను వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్ ఆర్ కాలనీలలో మౌలిక వసతులపై దృష్టి సారించామని తెలిపారు.