శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణానికి చెందిన లల్లిప్రియ నాయక్ అనే బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. నేడు పాఠశాలకు వెళ్లనని ఇంట్లో మారాం చేసింది దీంతో తల్లి అనీషా నాయక్ మందలించడంతో బాలిక ఇంటినుంచి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా బాలిక జాడ తెలీకపోవడంతో తల్లి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సీఐ రామకృష్ణ ఆదేశాలు మేరకు రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేవలం రెండు గంటల్లో బాలికను ఆమె తల్లి వద్దకు చేర్చారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.