పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మహాజన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తోందని, అందుకు అనుగుణంగా సీఎం చంద్రబాబు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా సబ్సిడీ పై ఆర్థిక పెట్టుబడి అందిస్తున్నారని గుర్తు చేశారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.