పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరో రెండు సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.