ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం బస్టాండ్‌కో.. నెట్ సెంటర్‌కో వెళ్లి సమయం వృథా చేసుకుంటున్నారా! అంత ప్రయాస అవసరం లేదండోయ్!! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మనమిత్ర- వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులువుగానే చేసుకునే అవకాశం ఉంది. ఈ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.