శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడ గ్రామంలో ఏర్పాటుచేసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం మంగళవారం నాటికి ఐదవ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ అటవీ శాఖ డివిజన్ రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. అటవీ జంతువులను వేటాడడం చట్టరీత్యా నేరం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు, అధ్యాపకులు కోదండరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.