శ్రీకాకుళం జిల్లా పలాస(M) రంగోయి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంతో కూడిన కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గడిచిన ప్రభుత్వంలో ఓ తుగ్లక్ పాలన చూసామని, మన తాతలు, తండ్రిల ఆస్తుల పుస్తకాలపై తుగ్లక్ (జగన్) ఫోటోతో ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకంలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్వర్ణ గ్రామం (సచివాలయం)లో పిర్యాదు చేస్తే వారం రోజుల్లో సరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకటేష్, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో వసంత్ కుమార్, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విఠల్ రావు, యూనిట్ కన్వీనర్ కుత్తుం ప్రకాష్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లీన శ్రీను, సీనియర్ నాయకులు గోరకల దాసుతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.