మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ.... పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ యాత్ర నేడు(శనివారం) ఇచ్చాపురంలో ముగియనుంది. అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు స్థానిక ఎమ్మెల్యే అశోక్ పాల్గొననున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.