శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగలనుంది. కవిటి మండలం నెలవంక గ్రామంలో నేడు(ఆదివారం) ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో వైకాపా ను వీడి టిడిపిలోకి భారీ చేరికలు రానున్నాయి. సర్పంచ్ దుర్గాశి కుమార్ మోహన్ రెడ్డి తోపాటు సుమారు 50 కుటుంబాలు పసుపు కండువా కప్పుకొనున్నాయి.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.