పలాస(M) లక్ష్మీపురం గ్రామంలో సోమవారం డీఎస్పీ షేక్ సహబబ్ అహ్మద్ ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ ఫోన్ లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. అత్యవసర సందర్భాల్లో 112 కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.