శ్రీకాకుళం జిల్లా పలాస(M) బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన సాహు ఆనంద్, నీలిభద్ర గ్రామానికి చెందిన బెహరా రమేష్ గంజాయిను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరు చిన్నచిన్న ప్యాకెట్లుగా గంజాయిను తయారుచేసి యువతకు అమ్మేవారు. ఒడిస్సా రాష్ట్రం బరంపురం పట్టణానికి చెందిన పప్పు అనే వ్యక్తి వద్ద సుమారు నాలుగు కిలోల గంజాయి కొని గోనెసంచిలో తరలిస్తుండగా కంబ్రిగాం బ్రిడ్జ్ సమీపంలో... పోలీసులు కు పట్టుబడినట్లు కాశీబుగ్గ డి.ఎస్.పి షేక్ సహబజ్ అహ్మద్ బుధవారం మీడియాతో తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.