శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో శనివారం డి.ఎస్.పి షేక్ సహబాజ్ అహమ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైనా ఇళ్లకు తాళం వేసి వెళ్లినట్లయితే కచ్చితంగా పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు. తాళం వేసిన ఇళ్లకు (ఎల్ హెచ్ ఎం ఎస్) సిస్టం అమర్చి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఇంట్లో బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులు ఉంచరాదని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.