శ్రీకాకుళం...
కాశిబుగ్గ పట్టణంలో అక్రమాలను ప్రశ్నించినందుకు నా విద్యా సంస్థలు(సూర్య తేజ)పై దాడులు చేస్తూ... గత 15 సంవత్సరాలుగా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని దానేటి పద్మజ మంగళవారం మీడియాతో వాపోయారు...
అంతేకాకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ... ఓ వార్త సంస్థ నిజాలు తెలుసుకోకుండా వార్తను ప్రచురించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
నాపై మానసిక, భౌతిక దాడులకు పాల్పడిన వారితో పాటు... అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.