శ్రీకాకుళం జిల్లా పలాస(M) శాసనాం గ్రామంలో సోమవారం రాత్రి ఒడిస్సా కు చెందిన యువకులు గ్రామంలో చొరబడి ఓ యువకుడిని చాకుతో బెదిరించారు. ఆ యువకుడు క్షణాల్లో తేరుకొని వారి ద్విచక్ర వాహన తాళం చెవిని తీసుకొని గ్రామంలోకి పారిపోయారు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఒడిస్సా కు చెందిన మరో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి ద్విచక్ర వాహనం కోసం ఆరా తీయగా... గ్రామస్తులు వారిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.