కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలాసను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మీడియా సాక్షిగా కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రకటించి, నేడు అసెంబ్లీలో ప్రకటించిన జిల్లాల్లో పలాస పేరు లేకపోవడం చాలా బాధాకరమని పలాసకు చెందిన దువ్వాడ శ్రీధర్ (బాబా) మీడియాతో తెలిపారు. భౌగోళికంగా పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి ప్రాంతాలకు అందుబాటులో ఉన్నటువంటి పలాసను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధిలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను విభజించి, పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరారు. పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు శాంతియుతంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు.