తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో కారు, టెంపో ట్రావెల్ బస్సును ఢీకొనడంతో.. ఘటనా స్థలంలో పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం (కొండూరు) గ్రామాలకి చెందిన ఇద్దరు యువకులు ఇల్లాకుల నవీన్ (25), పైడి సాయి(26) ఘటన స్థలంలో మృతి చెందిన విషయం తెలిసిందే..
తీవ్ర గాయాలు పాలైన గుంట రాజు అనే యువకుడు మధురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... సోమవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసముద్రంలో మునిగారు.