Skip to main content

Posts

Showing posts from March, 2026

సోంపేటలో పొద్దు పొడవకముందే పోలీసుల తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్  కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో  తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.

ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కాశీబుగ్గ జామియా మసీదులో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలలో ఉన్న ముస్లిం సోదరులు కులమత బేధాలు లేకుండా అభివృద్ధికి సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక టిడిపి నేతల తో పాటు... ముస్లిం పెద్దలు ఎస్.కె భాషా ప్రెసిడెంట్ జామ్యా మసీద్, ఎస్.కె బషీర్ సెక్రెటరీ, జిల్లా పార్లమెంటరీ కమిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ గౌస్, మహమ్మద్ షేక్ జిలాని, సయ్యద్ హుస్సేన్, ఎస్కే శమీ, ఎస్.కె జమీన్ఉద్దీన్, షేక్ అహ్మద్ తో పాటు మిగిలిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

పలాసలో నేడు జరగనున్న మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స: ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం.... పలాసలో నేడు జరగనున్న మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స. పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో నేడు మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విశాఖకు చెందిన వైద్య బృందం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సుమారు రూ. 12 కోట్ల నిధులతో అత్యాధునిక పరికరాలతో పాటు, అర్హత కలిగిన వైద్యులను నియమించారు. దీంతో సోంపేట పట్టణానికి చెందిన యువతి హేమశ్రీ కి మొదటి కిడ్నీ మార్పిడి చికిత్స నేడు జరుగుతుందని ఎమ్మెల్యే శిరీష తెలిపారు.

ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు..

శ్రీకాకుళం.... ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు.  పలాస మండలం కంబ్రిగాం పరిధిలో సృష్టించిన హడావుడి అంతా ఉత్తిదే...  ఎన్నో ఏళ్లగా కొర్నుగా ఉన్న భూమిలో రెవిన్యూ అధికారుల అనుమతితో మట్టి వేస్తున్న రైతులు. సర్వే నెంబర్ 18 లో ఒకచోట ఆరు సెంట్లు మరోచోట సెంటున్నార అధికంగా మట్టి వేసినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు. ఆ మట్టి తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి.           ------ మోహన్ అప్డేట్స్ 🎤                ☎️9705703970

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* TG: లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు: రేవంత్ * పార్టీ ఫిరాయింపులపై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ * AP: కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం: CBN * MLC అనంతబాబు భార్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ * అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: విజయ్ * గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి NTR జాతీయ పురస్కారం * వంట గ్యాస్ ₹60, కమర్షియల్ గ్యాస్పై ₹115 పెంపు * రాష్ట్రపతి WB పర్యటనలో ప్రొటోకాల్ వివాదం.. PM ఫైర్ * AP: క్వాంటం వ్యాలీతో అనేక మార్పులు: CBN * AP: లస్కర్ల జీతం రూ.6వేలు పెంపు * AP: ఇథిలీన్ గ్లైకాల్ కలవడంతోనే పాల కల్తీ * TG: గద్దర్ అవార్డులు: ఉత్తమ నటి- రష్మిక * TG: ఒకేసారి 130 మంది మావోల లొంగుబాటు * TG: ఈనెల 31లోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి🌱 *-[|-----|]-* *✒️𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘🤟🏽* 1917: విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం 1953: రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే జననం 1954: గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ జననం 1988: మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్హీత్ కౌర్ జననం 1993: చిలకలూరిపేట బస్సు దహన ఘటనలో 23 మంది దుర్మరణం 2012: సినీ నటి రాధాకుమారి మరణం * *అంతర్జాతీ...

కాశీబుగ్గ సాయిబుల కాలనీలో నిర్వహించిన ఆపరేషన్ వజ్రప్రహార్

ఆపరేషన్ వజ్ర ప్రహార్  కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు కాశీబుగ్గ సాయిబుల కాలనీలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నలుగురు సీఐలు, ఈగల్ టీం తో కలిపి సుమారు 60 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధిత సమాజం నిర్మించేందుకు సహకరించాలని స్థానికులచే ప్రతిజ్ఞ చేయించారు.

పలాసలో కలకలం రేపిన అస్థిపంజరం...

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి యొక్క అస్థిపంజరంను స్థానికులు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎముకుల గూడును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగి చాలా రోజులు కావడంతో... మృతిని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ దుస్తులను ఆధారంగా వివరాలు ఎవరికైనా తెలిస్తే కాశీబుగ్గ పోలీసులకు సంప్రదించాలని సిఐ రామకృష్ణ కోరారు.

గంజాయి తరలిస్తూ... కాశీబుగ్గ పోలీసులకు చిక్కిన ముగ్గురు వ్యక్తులు

ఒడిస్సా నుంచి చిత్తూరు జిల్లాకు గంజాయి తరలిస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డారు. సిఐ రామకృష్ణ తెలిపిన వివరాలు మేరకు శుక్రవారం ఎస్ఐ సునీల్ తన సిబ్బందితో పలాస రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా... అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు వద్ద ఉన్న బ్యాగ్ లు పరిశీలించగా వారి వద్ద 6.200 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. వీరుపై గతంలో పలు కేసులు నమోదయి ఉన్నాయన్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని శనివారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.

మర్రిపాడులో నిర్వహించిన లేగదూడల ప్రదర్శన

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడులో  శుక్రవారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో మేలు జాతి లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ యొక్క లెగదూడలను ప్రదర్శనకు తీసుకొచ్చారు. పశు వైద్యులు పద్మావతి, పాపారావు, మధుబాబు ఆధ్వర్యంలో రైతులకు ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం లెగదూడల పెంపకంపై పలు సూచనలు, సలహాలు రైతులకు పశు వైద్యులు పాపారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, మురిపింటి నారాయణ, రాపాక శాంతారావు, కోనారి గణపతి, అంబటి నారాయణ, కోనేరి వల్లభరావు, కొంచాడ మోహనరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

*✒️- 𝟎𝟔𝐌𝐚𝐫𝟐𝟔 / 𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒🤟🏽* * TG: రాజ్యసభకు వేంనరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ నామినేషన్ * AP: పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫ్రీ బస్సు * ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనే వారికి రూ.25వేల సాయం * బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా * బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ * అసోంలో సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్ * ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: PM * BJP చేతికి బిహార్ పగ్గాలు.. RSకు నితీశ్ * WB గవర్నర్ బోస్, లద్దాక్ LG కవీందర్ రిజైన్ * ఇద్దరు, ఆపై సంతానానికి రూ.25,000: CBN * జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: అయ్యన్న * కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్ * TG: రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ నామినేషన్ * TG: HYDలో రేవంత్ ఒక్క ఇల్లూ కట్టలేదు: KTR * T20WC.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్🌱 * హైదరాబాదులో సిక్కోలు కు చెందిన ఇద్దరు వలస కూలీలు మృతి.