రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారి రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.