ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరించే బాధ్యతను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించింది. డిసెంబర్ వరకు రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు అందిస్తారు. అలాగే కొత్తగా పెళ్లయిన దంపతులు ఆధార్, మ్యారేజ్ సర్టిఫికెట్‌తో రేషన్ కార్డు పొందొచ్చు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మ్యారేజ్ స్ప్లిట్ ఆప్షన్ ద్వారా కొత్త రేషన్ కార్డు పొందొచ్చు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.