శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించి భయాందోళన చెందుతూ.. పలాస జిఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.