నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో టిడిపి నేత ఆధ్వర్యంలో గొట్టిపాటి ప్రసాద్ ను దుండగులు కత్తితో గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డారు. గ్రామ శివారులోని తన కోళ్ల ఫారంలో గొట్టిపాటి ప్రసాద్ పని చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.