డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజులు ఉంటుంది. భక్తులకు ఈసారి డబుల్ బోనాంజా లభించనుంది. సర్వదర్శనం టోకెన్లు కూడా ఆన్లైన్ విధానంలోనే జారీ చేస్తారు. ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా ఉచిత సర్వదర్శనం టికెట్లు పొందవచ్చు. గతంలో జరిగిన తొక్కిసలాట కారణంగా టీటీడీ ఈ విధానాన్ని మార్చింది.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.