శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి సాయి కాలనీలో గురువారం డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పలాస డివిజన్ పరిధిలో ఉన్న 8 మండలాల పరిధిలో ఉన్న సచివాలయ పరిపాలన వ్యవస్థను ఈ కార్యాలయం నుంచి అనుసంధానంతో నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో వసంత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.