శ్రీకాకుళం జిల్లా నందిగాం(M) పెద్ద బాణాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెళ్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో... కారు అదుపుతప్పి డివైడర్ పై నుంచి దూసుకుపోయి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో ప్రమాదానికి కారణమైన వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనపై నదిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.