ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలాస ఉల్లాసపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ... నేడు ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకున్న పర్వదినమని తెలిపారు. ఇటీవల పలాసలో జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేసుకొని, పోలీసులు ముందస్తు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.