విషయంపై ప్రశ్నించిన టోల్ సిబ్బందిపై పరోక్ష దాడులకు పాల్పడుతున్న యాజమాన్యం. పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజాలో ఉద్యోగులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న పలు కార్మిక సంఘ నాయకులు.
మరోవైపు కూటమి ప్రభుత్వం పేరు చెబుతూ... నిరుద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు దండుకొని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు టోల్ సిబ్బంది గుసగుసలు ఆడుతున్నట్లు సమాచారం...!
ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించిన పొల్లాడ యువకుడు బంగారు సందీప్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ గ్రామానికి చెందిన బంగారు సందీప్ (వయస్సు 23) ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలను సాధించి అరుదైన ఘనత సాధించారు. ఆయన రీజినల్ రూరల్ బ్యాంక్‌లో ప్రొబేషన్‌రీ ఆఫీసర్ (PO), ఐబీపీఎస్ క్లర్క్ మరియు రీజినల్ రూరల్ బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఎంపికై తన ప్రతిభను చాటుకున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు ఇలాంటి విజయాన్ని సాధించడం స్థానికంగా ఆనందం మరియు గర్వకారణంగా మారింది. చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సందీప్ తన పాఠశాల విద్యను పూండి సాయి వినీత పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్, మునసబుపేటలో ఇంటర్మీడియట్ చదివారు. తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ విద్యను పూర్తిచేసి, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో క్రమశిక్షణతో సన్నద్ధమయ్యారు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు అనేక గంటలు కృషి చేసి బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమని సందీప్ నిరూపించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కు...
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామంలో రూ. 17 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించడానికి పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కాశీబుగ్గ జామియా మసీదులో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలలో ఉన్న ముస్లిం సోదరులు కులమత బేధాలు లేకుండా అభివృద్ధికి సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక టిడిపి నేతల తో పాటు... ముస్లిం పెద్దలు ఎస్.కె భాషా ప్రెసిడెంట్ జామ్యా మసీద్, ఎస్.కె బషీర్ సెక్రెటరీ, జిల్లా పార్లమెంటరీ కమిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ గౌస్, మహమ్మద్ షేక్ జిలాని, సయ్యద్ హుస్సేన్, ఎస్కే శమీ, ఎస్.కె జమీన్ఉద్దీన్, షేక్ అహ్మద్ తో పాటు మిగిలిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి యొక్క అస్థిపంజరంను స్థానికులు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎముకుల గూడును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగి చాలా రోజులు కావడంతో... మృతిని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ దుస్తులను ఆధారంగా వివరాలు ఎవరికైనా తెలిస్తే కాశీబుగ్గ పోలీసులకు సంప్రదించాలని సిఐ రామకృష్ణ కోరారు.