పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధి లేబర్ కాలనీలో మురుగు కాలువలు నిండి రోడ్లపై మురుగునీరు పారుతుంది. ఈ రోడ్డు దాటాలంటే సాహసమే చేయాలని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల పదోన్నతపై మున్సిపల్ కమిషనర్ గా విధుల్లో చేరిన శ్రీనివాసులు స్పందించి లేబర్ కాలనీలో మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.