శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. అనంతరం లారీ పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిస్సా ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందగా... నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బారువ ఆసుపత్రికి తరలించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.