జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు సందర్భంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే... రాష్ట్ర పండగగా గుర్తింపు పొందడంతో భక్తులు వేలాదిమందిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి ప్రసాదం పంపిణీ కొరత ఏర్పడడంతో ఎంతో నిరాశకు గురవుతున్నారు. అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ స్పందించి తక్షణమే స్వామివారి ప్రసాదం భక్తులకు కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.