శ్రీకాకుళం జిల్లా సోంపేట(M) బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందగా... నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే... బారువ ఆసుపత్రి చికిత్స పొందుతూ మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మృతులు ఒడిస్సా వాసులుగా గుర్తించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.