శ్రీకాకుళం జిల్లా మందస మండలం బేతాళపురం గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా... మహిళా కార్మికులపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఈ ఘటనలో బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికరాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కార్మికురాలు కీలు దుర్గమ్మ (32) తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.