రథసప్తమి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించి కునేందుకు లక్షలాదిమంది భక్తులు పోటెత్తారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు భారీ భద్రత ఏర్పాట్లు నిర్వహించారు. మరోవైపు వృద్ధులు, చిన్నారులు క్యూ లైన్ లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర రద్దీని దృష్టిలో ఉంచుకొని స్థానికులు మధ్యాహ్నం అనంతరం దర్శనానికి రావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.