పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 122 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలాస మున్సిపాలిటీ పరిధి కూటమి నేతలు కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల లేసి, బాణాసంచ కాలుస్తూ.. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తపరిచారు. అనంతరం పలాస ఇందిరా చౌక్ వద్ద బాణాసంచా కాలుస్తూ... పలాస అభివృద్ధి కొరకై నిరంతరం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే శిరీష కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, లోడగల కామేశ్వరరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గాలి కృష్ణారావు, దువ్వాడ శ్రీకాంత్, మల్లిపెద్ది చిన్ని, గురిటి సూర్యనారాయణ, గోల చంద్రరావు, అంబటి కృష్ణమూర్తి, అనీల్ శర్మ, సవర రాంబాబు డొక్కరి శంకర్, రవి శంకర్ గుప్తా, మళ్ళా శ్రీను, కొత్త సత్యం, దడియాల్ నర్సింగరావు, జోగ మల్లి, సార నోములరావు, తిరునాగర్ తిరుపతిరావు, పాండు రంగారావు, ధనుంజయ్ రావు, బుడత జగదీష్, బర్ల కృష్ణ, కొరికిన శంకర్, తివడాన శంకర్, పట్ట మల్లేష్, ch రామకృష్ణ, ఇప్పిలి చణిక్య, కృష్ణాయక్, నాగు పండా, నాబిల్లి శ్రీను, శంకు శ్రీకాంత్, దేవా, కేదార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.