శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో సాగునీటి ప్రాజెక్టుల పై అసెంబ్లీలో సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. కళింగదల్, డబార్శింగి, దామోదర సాగర్ ప్రాజెక్టు లను తెదేపా, ఎన్టీఆర్ సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ తీసుకొచ్చారన్నారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా 11 వేల 500 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులకు మరమ్మతులు అవసరం ఉందన్నారు. మరమ్మతులు చేయిస్తే మరో పదిహేనేళ్లు రైతులకు ఇబ్బంది ఉండదని, అలా చేయగలిగితే మందస మండల రైతులు కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ మద్దతుగా ఉంటారన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.