శ్రీకాకుళం జిల్లా పలాసలో రేపు జరగనున్న జామి జాతరకు ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు బుధవారం అడిషనల్ ఎస్పీ కె వి రమణ విలేకరులతో తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఇటు ట్రాఫిక్, అటు ఎల్లమ్మ తల్లి గుడి వద్ద సుమారు 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సిఐ రామకృష్ణ మాట్లాడుతూ... జాతర సందర్భంగా జంట పట్టణాలలో ట్రాఫిక్ మళ్లించామన్నారు. జాతరలో యువకులు గలాటా చేస్తే.. వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.