పలాస సబ్ స్టేషన్ పరిధిలో 11 కె.వి పీడర్ లైన్ మరమ్మత్తులు కారణంగా నేడు పలు ప్రాంతాలకు విద్యుత్ కు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొగిలిపాడు, ఉదయపురం, ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు, శాసనాం, ఆసుపత్రి రోడ్డు, రోటరీ నగర్, సూది కొండ, ఆంధ్ర బ్యాంక్ రోడ్డు, న్యూ కాలనీ, ఫిష్ మార్కెట్, హరిజన వీధి ప్రాంతాలలో అంతరాయం కలుగుతుందని పలాస డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి యజ్ఞేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.