Skip to main content

ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డ ఎస్సై భాను ప్రకాష్

* ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్.
* 2018 నుండి ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టిన భాను ప్రకాష్ 
* ఏపీ - రాయచోటికి చెందిన భాను ప్రకాష్.. అంబర్‌పేట్ పీఎస్‌లో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐగా విధులు నిర్వహణ.
* ఏపీలో ఎలక్ట్రిక్ ఏఈ ఉద్యోగం వచ్చిందని రిలీవ్ చేయాలని కోరిన భాను ప్రకాష్.. వెపన్ డిపాజిట్ కోరడంతో బయటపడ్డ ఉదంతం.
* ఓ దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న 4.3 తులాల బంగారాన్ని ఓ దుకాణంలో కుదువ పెట్టిన భాను ప్రకాష్.
* లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమై, యజమాని బంగారం తిరిగి అడగగా, కనిపించడం లేదని చెప్పిన ఎస్ఐ.
* దీంతో విచారించి ఆ దుకాణం నుండి బంగారాన్ని రికవరీ చేసి, భాను ప్రకాష్‌ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.
* 2018 నుండి బెట్టింగ్‌లకు అలవాటై భాను ప్రకాష్ రూ.కోటిన్నర పోగొట్టినట్లు, ఈ క్రమంలోనే సర్వీస్ రివాల్వర్‌ను కుదువ పెట్టినట్లు తెలిపిన పోలీసులు.

High Viewed News

సోంపేటలో పొద్దు పొడవకముందే పోలీసుల తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్  కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో  తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.

ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కాశీబుగ్గ జామియా మసీదులో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలలో ఉన్న ముస్లిం సోదరులు కులమత బేధాలు లేకుండా అభివృద్ధికి సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక టిడిపి నేతల తో పాటు... ముస్లిం పెద్దలు ఎస్.కె భాషా ప్రెసిడెంట్ జామ్యా మసీద్, ఎస్.కె బషీర్ సెక్రెటరీ, జిల్లా పార్లమెంటరీ కమిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ గౌస్, మహమ్మద్ షేక్ జిలాని, సయ్యద్ హుస్సేన్, ఎస్కే శమీ, ఎస్.కె జమీన్ఉద్దీన్, షేక్ అహ్మద్ తో పాటు మిగిలిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

బాలిగాంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామంలో రూ. 17 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించడానికి పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు..

శ్రీకాకుళం.... ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు.  పలాస మండలం కంబ్రిగాం పరిధిలో సృష్టించిన హడావుడి అంతా ఉత్తిదే...  ఎన్నో ఏళ్లగా కొర్నుగా ఉన్న భూమిలో రెవిన్యూ అధికారుల అనుమతితో మట్టి వేస్తున్న రైతులు. సర్వే నెంబర్ 18 లో ఒకచోట ఆరు సెంట్లు మరోచోట సెంటున్నార అధికంగా మట్టి వేసినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు. ఆ మట్టి తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి.           ------ మోహన్ అప్డేట్స్ 🎤                ☎️9705703970

పలాసలో కలకలం రేపిన అస్థిపంజరం...

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి యొక్క అస్థిపంజరంను స్థానికులు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎముకుల గూడును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగి చాలా రోజులు కావడంతో... మృతిని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ దుస్తులను ఆధారంగా వివరాలు ఎవరికైనా తెలిస్తే కాశీబుగ్గ పోలీసులకు సంప్రదించాలని సిఐ రామకృష్ణ కోరారు.