Skip to main content

ఫాస్టాగ్ పై కేంద్రం శుభవార్త.... ఇక నో టోల్ గేట్స్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ దేశంలోని అన్ని టోల్ గేట్‌ల వద్ద అందుబాటులోకి రానుంది. 2026 చివరి నాటికి దీన్ని అమలు చేయాలని ఉపరితల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. భవిష్యత్తులో ఏఐ, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారానే టోల్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. టోల్ ఛార్జీల వసూళ్లు AI ఆధారిత వ్యవస్థల ద్వారానే జరుగుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ఈ నూతన టోల్ విధానం శాటిలైట్, AI సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో కూడా సునాయాసంగా దాటిపోవచ్చు. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టోల్ వ్యవస్థ ద్వారా 1,500 కోట్ల రూపాయల మేర ఇంధనం ఆదా అవుతుంది. ప్రభుత్వానికి అదనంగా రూ. 6,000 కోట్ల రూపాయలు సమకూరుతాయని నితిన్ గడ్కరీ అంచనా వేశారు. వాహనదారులు, కేంద్ర ప్రభుత్వానికి లాభదాయకంగా విన్ టు విన్ విధానంలో ఉంటుందని చెప్పారు.

AI టోల్ కలెక్షన్లు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో విధానం కింద పనిచేస్తుంది. జాతీయ రహదారులపై టోల్ బూత్‌లు ఉండవు. వాటి స్థానంలో గాంట్రీ గేట్స్ నిర్మితమౌతాయి. ఈ గాంట్రీ గేట్లపై హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చుతారు. ఒక వాహనం గరిష్ట వేగంతో వెళ్లినప్పటికీ.. దాని నంబర్ ప్లేట్ ను గుర్తించి, విశ్లేషిస్తాయి. ఈ వ్యవస్థ ఆయా గేట్ల ఎంట్రీ/ఎగ్జిట్ లల్లో అమర్చుతారు. టోల్ ఛార్జీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా వసూలు అవుతాయి.

High Viewed News

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.