శ్రీకాకుళం జిల్లా మందస(M) నల్లబొడ్లూరు గ్రామంలో సర్వే నంబర్ 74/1 లో ఉన్న కొండ గత ప్రభుత్వ హయాంలో మాయమైన విషయం తెలిసిందే... ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తో కలిసి పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ కొండను తవ్వి కంకర కొల్లగొట్టిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎమ్మార్వోకు ఆదేశించారు. అలసత్వం వయిస్తే A1, A2 మందస ఎమ్మార్వో శ్రీకాంత్, పలాస ఆర్డీవో వెంకటేష్ లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.