శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ఆవరణంలో రైల్వే మాల్ గోదాం "వన్డే వర్కర్స్ కాన్ఫరెన్స్" ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ రైల్వే మాల్ గోడౌన్ శ్రామిక్ సంగ్ నేషనల్ ఇన్చార్జ్ మనోరంజన్ పాశ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... *ఈశ్రమ్* కార్డును ప్రతి కార్మికుడికి అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఇన్చార్జ్ గా విధులు నిర్వహిస్తున్న మామిడి కమలమ్మను అధ్యక్షురాలుగా ఆయన ప్రకటించారు. అనంతరం గిరిజన మహిళలు నిర్వహించిన దింసా నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వందలాది మంది కార్మికులు హాజరయ్యారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.