మహిళలపై పెరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండే కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 14490ను ప్రారంభించింది. హింస, వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. న్యూఢిల్లీలోని కార్యాలయం నుండి పనిచేసే ఈ హెల్ప్‌లైన్, బాధిత మహిళలను పోలీసు, ఆసుపత్రులు, న్యాయ అధికారులు వంటి సంబంధిత అధికారులతో అనుసంధానిస్తుంది.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.