మహిళతో అసభ్యకరంగా నృత్యం చేసిన కంకిపాడు పోలీస్ స్టేషన్ హోంగార్డ్ సంజయ్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. కంకిపాడు శివార్లలో చిన్నారుల ముందు హోంగార్డు ఓ మహిళతో అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన ఎస్పీ విద్యాసాగర్ హోంగార్డ్ అజయ్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్‌కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.