Skip to main content

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

* AP: ఎవరికి కేటాయించిన పదవిలో వారే పని చేస్కోవాలి: CBN

* జనసేన MLA అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు

* పేర్ని నానిపై TDP నేతల ఫిర్యాదు

* TG: సింగరేణి కుంభకోణంపై గవర్నర్కు BRS నేతల ఫిర్యాదు

* సిట్ విచారణకు హాజరైన మాజీ MP సంతోష్ రావు

* LAW CET పరీక్షల షెడ్యూల్ విడుదల

* U-19 ప్రపంచకప్లో జింబాబ్వేపై టీమిండియా విజయం

* EUతో ట్రేడ్ డీల్.. కోట్ల మందికి అద్భుత అవకాశాలు: PM మోదీ

* TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచి నామినేషన్స్

* మేడారం జాతర.. ప్రజలకు CM రేవంత్ శుభాకాంక్షలు

* సింగరేణిలో అవినీతి జరగలేదు: భట్టి

* ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి: చంద్రబాబు

* 'జనసేన ఎమ్మెల్యే రాసలీలలు'.. YCP సంచలన వీడియో

* సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్🌱

High Viewed News

సోంపేటలో పొద్దు పొడవకముందే పోలీసుల తనిఖీలు

ఆపరేషన్ వజ్రప్రహార్  కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో  తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.

ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిరీష

ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కాశీబుగ్గ జామియా మసీదులో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జంట పట్టణాలలో ఉన్న ముస్లిం సోదరులు కులమత బేధాలు లేకుండా అభివృద్ధికి సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు స్థానిక టిడిపి నేతల తో పాటు... ముస్లిం పెద్దలు ఎస్.కె భాషా ప్రెసిడెంట్ జామ్యా మసీద్, ఎస్.కె బషీర్ సెక్రెటరీ, జిల్లా పార్లమెంటరీ కమిటీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ గౌస్, మహమ్మద్ షేక్ జిలాని, సయ్యద్ హుస్సేన్, ఎస్కే శమీ, ఎస్.కె జమీన్ఉద్దీన్, షేక్ అహ్మద్ తో పాటు మిగిలిన ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

బాలిగాంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామంలో రూ. 17 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించడానికి పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు..

శ్రీకాకుళం.... ఆక్రమణ లేదు రియల్ ఎస్టేట్ అంతకన్నా లేదు.  పలాస మండలం కంబ్రిగాం పరిధిలో సృష్టించిన హడావుడి అంతా ఉత్తిదే...  ఎన్నో ఏళ్లగా కొర్నుగా ఉన్న భూమిలో రెవిన్యూ అధికారుల అనుమతితో మట్టి వేస్తున్న రైతులు. సర్వే నెంబర్ 18 లో ఒకచోట ఆరు సెంట్లు మరోచోట సెంటున్నార అధికంగా మట్టి వేసినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు. ఆ మట్టి తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి.           ------ మోహన్ అప్డేట్స్ 🎤                ☎️9705703970

పలాసలో కలకలం రేపిన అస్థిపంజరం...

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామ సమీపంలో ఉన్న పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి యొక్క అస్థిపంజరంను స్థానికులు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎముకుల గూడును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగి చాలా రోజులు కావడంతో... మృతిని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ దుస్తులను ఆధారంగా వివరాలు ఎవరికైనా తెలిస్తే కాశీబుగ్గ పోలీసులకు సంప్రదించాలని సిఐ రామకృష్ణ కోరారు.